భారత సంతతి న్యాయమూర్తికి కీలక విచారణ అప్పగింత - Indian Born Judge Amit Mehta Assigned in Google Lawsuit in US
close
Published : 22/10/2020 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 భారత సంతతి న్యాయమూర్తికి కీలక విచారణ అప్పగింత

దశాబ్దాల నాటి కేసులో కీలకం కానున్న తీర్పు

వాషింగ్టన్: అమెరికాలో రెండు దశాబ్దాలుగా నలుగుతున్న కీలక గూగుల్‌ కేసు విచారణలో.. భారతీయ మూలాలున్న అమిత్‌ మెహతా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌పై ఆరోపణలకు సంబంధించి ఆ దేశ న్యాయశాఖ, 11 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌తో సహా  కొలంబియా జిల్లా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసు విచారణను మెహతా చేపట్టనున్నారు.

అమిత్‌ మెహతా గుజరాత్‌లోని పటాన్‌లో జన్మించారు. జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలతో బీఏ పూర్తిచేశారు. అనంతరం 1997లో వర్జీనియా స్కూల్‌ ఆఫ్ లా నుంచి డాక్టరేటు పట్టాను పొందారు. ఆ తర్వాత  ఓ న్యాయ సలహా సంస్థలో కొంత కాలం పనిచేశారు. ఆపై కొలంబియా జిల్లా న్యాయస్థానంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా 2002 నుంచి విధులు నిర్వహించారు.  2014లో నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మెహతాను కొలంబియా జిల్లా న్యాయమూర్తిగా నియమించారు.

రు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని