రష్యా టీకా: భారత ఎంబసీ చర్చలు! - Indian Embassy in Moscow in touch with developer of Russian vaccine
close
Published : 18/08/2020 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్యా టీకా: భారత ఎంబసీ చర్చలు!


మాస్కో : ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌ కూడా టీకా సమాచారాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా టీకా పరిశోధకులతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయం చర్చిస్తున్నట్లు సమాచారం.

‘భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా పరిశోధకులతో ఇండియన్‌ మిషన్‌ ప్రత్యేకంగా టచ్‌లో ఉంది. టీకా భద్రత, సమర్థతకు సంబంధించిన సమాచారం కోసం వేచి చూస్తున్నాం’ అని ఓ అధికారి తెలిపినట్లు సమాచారం.

కరోనాకు తొలి వ్యాక్సిన్‌ సిద్ధం చేసినట్లు రష్యా అధ్యక్షుడు ఈ నెల 11న ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమార్తె కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఆ సమయంలో వెల్లడించారు. తమ వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నట్లు కూడా ఆ దేశం ప్రకటించుకుంది. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ తెలిపారు.

మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ను ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా చెబుతోంది. మరోవైపు పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టకుండానే తీసుకువస్తున్న ఈ వ్యాక్సిన్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని