భారత టెక్‌ నిపుణులే కావాలి - Indian tech experts are needed
close
Published : 19/12/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత టెక్‌ నిపుణులే కావాలి

 అమెరికా, బ్రిటన్‌ సంస్థల చూపు ఇటే: టెెక్‌ఫైండర్‌  

ముంబయి: అధిక నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న దేశాల్లో బ్రిటన్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, అమెరికా, దక్షిణాఫ్రికా నిలిచినట్లు కాంట్రాక్టర్‌ హైరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్‌ఫైండర్‌ సర్వే పేర్కొంది. ‘గ్లోబల్‌ డిమాండ్‌ ఫర్‌ ఇండియన్‌ ఐటీ కాంట్రాక్టర్స్‌’ పేరిట సంస్థ సర్వే వెలువరించింది. క్లౌడ్‌, సైబర్‌, డిజిటలీకరణతో కూడిన కీలకమైన డొమైన్ల కోసం ఆయా దేశాల కంపెనీలు భారత ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నట్లు టెక్‌ఫైండర్‌ తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు మధ్య దేశవ్యాప్తంగా 52000 మంది నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలోని మరిన్ని అంశాలు ఇలా..
* కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా వ్యాపారాలు తమ ఉత్పత్తులు, సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి. దీని వల్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, సీనియర్‌ జావా డెవలపర్లు, సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, వెబ్‌ డెవలపర్లు, యూఐ/యూఎక్స్‌ డిజైనర్లు వంటి ఐటీ నిపుణులకు గిరాకీ మరింత పెరిగింది.

* అధిక నైపుణ్యం కలిగిన భారతీయులను తీసుకుని, అట్టేపెట్టుకోడానికి బ్రిటన్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, అమెరికా, దక్షిణాఫ్రికా మొగ్గుచూపుతున్నాయి.
* ఫిలిప్పీన్స్‌, నెదర్లాండ్స్‌, నైజీరియా, కెనడా, కెన్యా, బ్రెజిల్‌ దేశాల్లో ఈ ఏడాది మార్చి తర్వాత ఐటీ నిపుణుల కోసం ఉద్యోగాలు ఏకంగా 610 శాతం వృద్ధి చెందాయి.
* ఐటీ రంగం 48 శాతం నియామకాలతో అగ్రస్థానంలో ఉంది. బీమా (18 శాతం), బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ (16 శాతం), టెలికమ్యూనికేషన్లు (12 శాతం), ఫార్మా (6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని