2 కోట్లకు చేరువలో కొవిడ్‌ కేసులు - Indias trajectory a worry as the world nears 20 million Covid 19 cases
close
Updated : 10/08/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2 కోట్లకు చేరువలో కొవిడ్‌ కేసులు

దిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు రెండు కోట్లకు చేరువయ్యాయి. ఆదివారం రాత్రి వరకు 1,99,22,762 కేసులు నమోదయ్యాయి. అయితే అతి త్వరలోనే ఈ సంఖ్య రెండు కోట్లకు చేరువయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు 7,31,747 మంది మృతిచెందగా, మరణాల రేటు 3.7 శాతంగా ఉంది. కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌,భారత్‌ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 22,12,737 కేసులు నమోదవగా, 44,386 మంది మరణించారు.

గత వారం రోజులుగా భారత్‌లో అమెరికా కంటే ఎక్కవ కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టు 1 నుంచి 8వ తేదీల్లో అమెరికాలో 3,84,089 మంది కరోనా బారిన పడగా దేశంలో 3,99,263 మందికి వైరస్‌ సోకింది. రోజువారీ కొవిడ్‌ కేసుల్లో అమెరికాను అధిగమించడం ఇదే మొదటిసారి. దేశంలో కరోనా మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని