అడవి శేష్‌ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ..! - Interesting Update About Major Movie
close
Published : 24/09/2020 21:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడవి శేష్‌ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ..!

సరికొత్త అప్‌డేట్‌ షేర్‌ చేసిన టీమ్‌

హైదరాబాద్‌: వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అడివి శేష్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘మేజర్‌’. 2008 ముంబయి దాడిలో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మేజర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శశి కిరణ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్రబృందం గురువారం అభిమానులతో పంచుకుంది. ‘దబాంగ్‌ 3’ చిత్రంతో అక్కడి ప్రేక్షకులను అలరించిన సయీ మంజ్రేకర్‌ ‘మేజర్‌’ చిత్రంలో ఓ కీలకపాత్రను పోషించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఆమెకు ‘మేజర్‌’ టీంలోకి స్వాగతం తెలిపింది.

కాగా, ‘వీరుడు, ధీరుడు అయిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న బయోపిక్‌లో భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టాలని ఉంది’ అని సయీ మంజ్రేకర్‌ పేర్కొన్నారు. మరోవైపు శోభిత ధూళిపాళ్ల సైతం ఈ సినిమాలో నటించనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ అక్టోబరు నుంచి ప్రారంభం కానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని