వధువు చందమామ.. వరుడి గురించి తెలుసా? - Interesting facts about Gautam Kitchlu
close
Updated : 06/10/2020 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వధువు చందమామ.. వరుడి గురించి తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. అక్టోబరు 30న గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకోబోతున్నానంటూ ప్రకటించారు. దీంతో ఆమెను కలల రాకుమారిగా భావించే కుర్రకారు హృదయాలు నొచ్చుకున్నాయి. కాజల్‌ కామెంట్‌ సెక్షన్‌ సందేశాలు, శుభాకాంక్షలతో నిండిపోతోంది. ఆమె, గౌతమ్‌ కలిసి పలు సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇది సరే.. అసలు గౌతమ్‌ కిచ్లు ఎవరు? ఆయన ఏం చేస్తుంటారు? అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలిసిన కొన్ని విషయాలు మీ కోసం..

* గౌతమ్‌ ఓ వ్యాపారవేత్త. డిసెర్న్ లివింగ్ అనే డిజైనింగ్‌ సంస్థను స్థాపించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో ఆయన తనను తాను ఇంటీరియర్‌గా, టెక్‌-డిజైన్‌ ఔత్సాహికుడిగా వర్ణించుకున్నారు. ఆయన తన ఖాతాలో దాదాపు డిజైనింగ్‌కు సంబంధించిన ఫొటోలను మాత్రమే షేర్‌ చేశారు.

* ఇంటిని, గదుల్ని డిజైన్‌ చేయడంతోపాటు గౌతమ్‌ ఫర్నీచర్‌, అలంకరణ వస్తువులు, పెయింటింగ్‌ వంటి సామాగ్రిని కూడా తన కంపెనీ ద్వారా విక్రయిస్తున్నారు.

* గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన పనికి సంబంధించిన ఫొటోలను తరచూ షేర్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు 869 పోస్ట్‌లు చేశారు. ఆయన్ను 12.5k మంది ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు.

* గౌతమ్‌ బీచ్‌లో తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకున్న ఫొటోలు ఆగస్టు 16న షేర్‌ చేశారు. మరో ఏడాది పూర్తయిందన్నారు.

* గౌతమ్‌ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆయన గత ఏడేళ్లుగా ముంబయి మారథాన్‌లో పాల్గొంటున్నారట. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని కూడా షేర్‌ చేశారు. కాజల్‌ కూడా పలుమార్లు ఇందులో పాల్గొన్నారు.

* గత ఏడాది గౌతమ్‌ తన సోదరికి ప్రత్యేకంగా రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. ఇద్దరూ ఫోన్లు చూసుకుంటున్న ఫొటో షేర్‌ చేసి.. తన సోదరికి సోషల్‌ మీడియా వేదికగా విష్‌ చేయడమే సరైన పద్ధతని సరదాగా మాట్లాడారు.

* గత ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా గౌతమ్‌ తన తల్లి, సోదరి కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘హ్యాపీ ఉమెన్స్‌ డే. నా జీవితంలోని అద్భుతమైన మహిళలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

* గౌతమ్‌కు ప్రకృతి, జంతువులు, ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నట్లు తెలుస్తోంది. 2018 డిసెంబరులో దక్షిణాఫ్రికాకు వెళ్లి.. అక్కడ జంతువుల ఫొటోలు తీసి.. షేర్‌ చేశారు. ఫొటోగ్రఫీ రోజున శుభాకాంక్షలు చెప్పారు.

* 2017 జనవరిలో గౌతమ్‌ డిసెర్న్ లివింగ్ బృందం ఫొటోను షేర్‌ చేశారు. ఓ ఎగ్జైటింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. 

* ఆన్‌లైన్‌లో కాజల్‌-గౌతమ్‌ పాత ఫొటోలు వైరల్‌గా మారాయి. అంటే వీరికి చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదివినట్లు సమాచారం. చిన్నతనం నుంచే వీరికి పరిచయం ఉందని చెబుతున్నారు. ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారినట్లు సమాచారం.

* ఇటీవల కాజల్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు షేర్‌ చేశారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో తీసిన చిత్రాలవి. కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని