నకిలీ వ్యాక్సిన్లు రావొచ్చు.. జాగ్రత్త! - Interpol warns that COVID-19 vaccines could be targeted by criminals
close
Published : 02/12/2020 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నకిలీ వ్యాక్సిన్లు రావొచ్చు.. జాగ్రత్త!

హెచ్చరించిన ఇంటర్‌పోల్‌

పారిస్‌: కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తున్న వేళ ఇంటర్‌పోల్‌ కీలక హెచ్చరికలు చేసింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై నేరగాళ్లు గురిపెట్టే ప్రమాదం ఉందని.. నకిలీ టీకాలు విక్రయించే అవకాశం లేకపోలేదని గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు 194 సభ్య దేశాలను అప్రమత్తం చేస్తూ గ్లోబల్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

‘ప్రస్తుతం చాలా దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని క్రిమినల్‌ సంస్థలు చొరబాట్లకు పాల్పడి వ్యాక్సిన్‌ సరఫరాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. నకిలీ వెబ్‌సైట్లతో ప్రజలకు చేరువై వారి ఆరోగ్యం, ప్రాణాలను ప్రమాదంలో పెట్టాలని చూస్తున్నాయి. ఈ నేరగాళ్లు నకిలీ టీకాలను తయారుచేసి విక్రయించే ప్రమాదం కూడా ఉంది’ ఇంటర్‌పోల్‌ సెక్రటరీ జనరల్‌ జుర్గెన్‌ స్టాక్ వెల్లడించారు. ఇలాంటి నేరగాళ్ల ముఠాల పట్ల అన్ని ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాకు తొలి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేస్తూ యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి ప్రాధాన్యం కింద సంరక్షణ కేంద్రాల్లో ఉండే వృద్ధులు, వారిని చూసుకునే సిబ్బంది, ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు యూకే వెల్లడించింది.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని