రిటైరైన దిగ్గజాల కోసం.. ఇర్ఫాన్‌ ఏమన్నాడంటే? - Irfan Pathan wants to play charity match between Retired players and Current Indian Team
close
Published : 24/08/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిటైరైన దిగ్గజాల కోసం.. ఇర్ఫాన్‌ ఏమన్నాడంటే?

ధోనీ సేన vs కోహ్లీ సేన ఛారిటీ మ్యాచ్‌‌ ?

ఇంటర్నెట్‌డెస్క్‌: గత దశాబ్దంలో ఎంతో మంది టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రిటైరయ్యారు. విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్‌ మొదలుకొని ఇటీవల మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ వరకు చాలా మంది ఆటకు విశ్రాంతి ప్రకటించారు. అందులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ మినహా మిగతావారంతా సరైన వీడ్కోలు‌ మ్యాచ్‌ ఆడలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే అయినా కాదనేలేని వాస్తవం. మరోవైపు చాలా మంది క్రికెటర్లు ఈ విషయంపై మనోవేదనకు కూడా గురయ్యారు. కొందరు బయటకి చెప్పకపోయినా సన్నిహితుల వద్ద వాపోయారు. ఇదే విషయంపై యువరాజ్‌ సింగ్‌ గతేడాది రిటైర్మెంట్‌ ప్రకటించాక మీడియా ఎదుట బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
2011 వన్డే ప్రపంచకప్‌ తర్వాత మెల్లిమెల్లిగా సీనియర్లను దూరం పెట్టడంతో చాలా మంది వైదొలగారు. అలా గంభీర్‌, సెహ్వాగ్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, యువీ, రైనా, ఇర్ఫాన్‌, జహీర్‌లాంటి దిగ్గజాలు ఫేర్‌వెల్‌ మ్యాచ్‌లు ఆడకుండానే రిటైర్మెంట్‌ ప్రకటించారు. తమ అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వీరిని గౌరవప్రదంగా సాగనంపలేదనే బాధ అభిమానుల్లోనూ కొంత ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఒక సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఇప్పటికే రిటైరైన ఆ దిగ్గజాలతో.. ప్రస్తుత కోహ్లీ సేనకు ఓ ఛారిటి మ్యాచ్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందని అభిమానులను అడిగాడు. అది వారికి ఫేర్‌వెల్‌ మ్యాచ్‌లాగానూ అనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకోసం రిటైరైన ఆటగాళ్లతో ఒక జట్టును కూడా రూపొందించాడు. 

రిటైర్మెంట్‌ టీమ్‌ ఆటగాళ్లు:
గౌతమ్‌ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, ధోనీ, ఇర్ఫాన్‌ పఠాన్‌, అజిత్‌ అగార్కర్‌, జహీర్‌ఖాన్‌, ప్రగ్యాన్ ఓజా


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని