కొవిడ్‌ వ్యాక్సిన్‌: నగరాలకే తొలి ప్రాధాన్యమా? - Is corona Vaccine for priority groups only health ministry gives clarity
close
Published : 11/11/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వ్యాక్సిన్‌: నగరాలకే తొలి ప్రాధాన్యమా?

పుకార్లకు కేంద్ర ఆరోగ్య శాఖ చెక్‌  

దిల్లీ: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీలో కొన్ని ప్రాంతాలకు చెందిన వారికే ప్రాధాన్యముంటుందని వినవస్తున్న వార్తలకు కేంద్రం స్వస్తి పలికింది. టీకా పంపిణీలో ఏ విధమైన అసమానతలు ఉండబోవని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మెట్రోలు, నగరాల్లో నివసిస్తున్న వారికే పెద్ద పీట అని వస్తున్న వార్తలు వట్టి పుకార్లని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ ఖండించారు. టీకా పంపిణీలో మెట్రోలు, మెట్రోయేతర నగరాలు, పట్టణాల పట్ల ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపబోదని.. భౌగోళిక పరిస్థితుల ప్రకారం కాకుండా ఆవశ్యకతను బట్టి వివిధ వర్గాలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఓ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ప్రాంతాలకు అతీతంగా, సమాజంలో అందరికీ టీకా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన వివరించారు.

ఉత్పత్తి, పంపిణీల్లో దేశం ముందంజ

ఈ ప్రణాళికలో భాగంగా నిపుణుల బృందం జాతీయ, అంతర్జాతీయ వ్యాక్సిన్‌ తయారీదార్లతో చర్చలు జరుపుతోందని ఆరోగ్య శాఖ సెక్రటరీ తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. అవసరమైన వ్యాక్సిన్‌ అనుమతులు లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక వ్యాక్సిన్లను మైనస్‌ 90 డిగ్రీ సెల్సియస్‌ వద్ద నిల్వ ఉంచి, తరలించే ఏర్పాట్ల గురించి కూడా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీలోనే కాకుండా పంపిణీకి అవసరమయ్యే కోల్డ్‌ చైన్‌ ఏర్పాట్ల విషయంలో కూడా భారత్‌ ముందంజలో ఉందని రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. దేశంలో ఉన్న 28 వేలకు పైబడి కోల్డ్‌ చైన్‌ కేంద్రాలను, 700 శీతలీకరణ వ్యాన్‌లను, 70 వేలకు పైగా వ్యాక్సినేటర్‌ వ్యవస్థలను వ్యాక్సిన్‌ సమర్ధ పంపిణీకి వినియోగించనున్నట్టు ఆరోగ్య శాఖ గతంలో ప్రకటించింది.

తమ కొవిడ్‌ వ్యాక్సిన్‌ 90 శాతం విజయవంతమైందని ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్‌ ఇటీవల ప్రకటించింది. ఐతే శీతలీకరణ కంటైనర్ల ద్వారా మాత్రమే టీకా రవాణా సాధ్యమయ్యే పరిస్థితిలో.. గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ కష్టతరమనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని