close

తాజా వార్తలు

Updated : 22/11/2020 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రజనీ ఆరోగ్యం: స్పందించిన ప్రతినిధులు

చెన్నై: అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన ప్రతినిధులు స్పష్టం చేశారు. తలైవా గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని,  చికిత్స తీసుకుంటున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై సూపర్‌స్టార్‌ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. ‘రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన నిన్నటి నుంచి పోయెస్ గార్డెన్‌లోని నివాసంలోనే ఉన్నారు’ అని సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. గత వారం రజనీ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను వేడుకగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ ఇటీవల షేర్‌ చేశారు. ‘మా కుటుంబసభ్యుల తరఫున మీకంతా దీపావళి శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వాదాలు మనకు ఎప్పుడూ ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఫొటోలో రజనీ ఎంతో సంతోషంగా టపాకాయలు పేలుస్తూ కనిపించారు. ‘దర్బార్‌’ తర్వాత రజనీ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ‘అన్నాత్తై’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరోపక్క తమిళ నటుడు తలవసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తనకు క్యాన్సర్‌ సోకిందని, సాయం చేయమని ఆయన వేడుకుంటున్న వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న రజనీ స్వయంగా తలవసికి ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి, ఆర్థిక సాయం అందించారు. త్వరలోనే కోలుకుంటావంటూ ఆయనలో ధైర్యం నింపారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.