close

తాజా వార్తలు

Published : 19/09/2020 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మని చూసి హీరో కన్నీరు..!

భావోద్వేగంతో పోస్ట్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ తన తల్లి నీలిమా అజీమ్‌ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఒకప్పుడు వెండితెర, బుల్లితెరపై సందడి చేసిన నీలిమ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘డోలీ కిట్టి ఔర్‌ ఓ చమక్తే సితారే’ అనే సినిమా కోసం చిన్న పాత్రలో నటించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలై ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు చిత్రాన్ని వీక్షించిన ఇషాన్‌.. తెరపై తన తల్లిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం గురించి తెలియచేస్తూ ఇన్‌స్టాలో ఓ లేఖ పెట్టారు.

‘‘డోలీ కిట్టి ఔర్‌ ఓ చమక్తే సితారే’ వల్ల ఈ రోజు మా అమ్మను స్క్రీన్‌పై చూశా. అమ్మా.. నువ్వు ఎప్పటిలానే అందంగా ఉన్నావు. నువ్వు కనిపించిన ఓ సన్నివేశం నా హృదయాన్ని ఎంతలా హత్తుకుందో మాటల్లో వర్ణించలేను. ఇది చూశాక.. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. మనకి ఇష్టమైన నటీనటులు ఓ సినిమా కోసం కలిసి పనిచేస్తే చూసి ఎంతో ఆనందిస్తాం. కానీ ఈరోజు మాత్రం వ్యక్తిగతంగా మరెంతగానో సంతోషిస్తున్నాను. చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నాను.’ అని ఇషాన్‌ పేర్కొన్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.