ఆ విమానాల్లో ఐసోలేషన్‌ జోన్‌ అక్కర్లేదు - Isolation relaxations for internationa flights in India
close
Updated : 21/12/2020 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ విమానాల్లో ఐసోలేషన్‌ జోన్‌ అక్కర్లేదు

దిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున విమానయాన సంస్థలపై విధించిన ఆంక్షలను మరింత సడలించాలని కేంద్రం నిర్ణయించింది. నాలుగు గంటల వ్యవధిలోపు ప్రయాణం పూర్తిచేసుకునే విమానాల్లో ఐసోలేషన్‌ జోన్‌ని ఏర్పాటుచేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అంతర్జాతీయ విమానాలకు సడలింపులివ్వాలని ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ బన్సాల్‌ విజ్ఞప్తి చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 16న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలలో క్వారంటైన్‌ కోసం కొన్ని సీట్లను ఖాళీగా విడిచిపెట్టాలన్న నిబంధనను సవరించింది. నాలుగు గంటలకు మించిన ప్రయాణ వ్యవధి ఉన్న విమానాల్లో చివరి వరుసలోని కుడివైపునున్న సీట్లను క్వారంటైన్‌ కోసం రిజర్వు చేయాలని ఆదేశాల్లో తెలిపింది. గగనతలంలో ప్రయాణికులకు కొవిడ్‌ సంబంధిత లక్షణాలు వృద్ధి చెందితే.. వారికోసం అవసరమైన పీపీఈ కిట్లను విమానయాన సంస్థలు సమకూర్చాలని పేర్కొంది. 

ఇవీ చదవండి

మీ పిఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోండిలా..

చైనా కంపెనీలకు అమెరికా షాక్‌..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని