రోహిత్‌ కెప్టెన్‌ కాకుంటే టీమిండియాకే సిగ్గుచేటు - It would be a shame and loss for Indian cricket if Rohit isnt made T20 skipper Gambhir
close
Updated : 11/11/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌ కెప్టెన్‌ కాకుంటే టీమిండియాకే సిగ్గుచేటు

గౌతమ్‌ గంభీర్‌ ఘాటు వ్యాఖ్యలు

దిల్లీ: మాజీ క్రికెటర్‌‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్‌ చేశాడు. అలా చేయకుంటే అది టీమ్‌ఇండియాకే సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ముంబయి ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత గౌతీ మాట్లాడాడు.

‘రోహిత్‌ శర్మ టీమ్‌ఇండియాకు సారథి కాకపోతే అది జట్టుకే నష్టం. అతడికి కాదు. జట్టు ఎంత పటిష్ఠంగా ఉంటుందో కెప్టెన్‌ కూడా అంతే ఉండాలి. దానిని నేను అంగీకరిస్తా. అయితే ఒక సారథి మెరుగైనవాడా? కాదా? అని ఎలా నిర్ణయించగలం? ఆ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి. రోహిత్‌ ఐదుసార్లు ముంబయికి ట్రోఫీ అందించాడు’ అని గంభీర్‌ అన్నాడు.

‘భారత్‌లో ఎంఎస్‌ ధోనీ అత్యుత్తమ సారథి అని ఎప్పుడూ అంటాం. ఎందుకంటే అతడు రెండు ప్రపంచకప్‌లు, మూడు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచాడు కాబట్టి. రోహిత్‌ సైతం ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచాడు. టోర్నీ చరిత్రలోనే అతడు అత్యంత విజయవంతమైన నాయకుడు. ఇంకా చెప్పాలంటే టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల సారథ్యం లేదా టీ20 నాయకత్వం అతడికి అప్పజెప్పకుంటే అది సిగ్గుచేటే. ఇంతకన్నా నిరూపించుకోవడానికి ఇంకేముంటుంది? అతడు టీమ్‌ఇండియా కెప్టెన్‌ కాకపోతే జట్టుకే నష్టం’ అని గౌతీ స్పష్టం చేశాడు.

ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీని తానేమీ తక్కువ చేయడం లేదని గంభీర్‌ అన్నాడు. అన్ని దేశాలు అవలంభిస్తున్న ఇద్దరు సారథుల వ్యూహం పనిచేస్తుందని నొక్కి చెబుతున్నా అన్నాడు. ‘బీసీసీఐ ఇద్దరు కెప్టెన్లను పరిశీలించాలి. ఎవ్వరూ తక్కువేమీ కాదు. తెల్ల బంతి క్రికెట్లో కోహ్లీ కన్నా తాను మెరుగైన సారథిగా రోహిత్‌ నిరూపించుకున్నాడు. 13 సీజన్లలో ఒక ఆటగాడు ఐదు టైటిళ్లు అందిస్తే మరొకరు ఏమీ చేయలేదు. రోహిత్‌, కోహ్లీ ఒకే వేదికపై నాయకత్వం వహించారు. ఒకే సమయంలో సారథులుగా ఉన్నారు. రోహిత్‌ విజయవంతం అయ్యాడు’ అని అన్నాడు.

ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ సైతం గంభీర్‌తో ఏకీభవించాడు. రోహిత్‌శర్మ టీమ్‌ఇండియా టీ20 సారథిగా ఎంపికవ్వాలని పేర్కొన్నాడు. అతడికి టీ20లు ఎలా గెలవాలో తెలుసని ప్రశంసించాడు. ఇక మాజీ క్రికెటర్లు, అభిమానులు రోహిత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని