‘3 రాజధానులు’పై రేపు జనసేన కీలక భేటీ - JANA SENA PARTY MEET TOMMORROW ON THREE CAPITAL IN ANDHRA PRADESH
close
Updated : 01/08/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘3 రాజధానులు’పై రేపు జనసేన కీలక భేటీ

పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీతో భేటీ కానున్న పవన్‌ కల్యాణ్

అమరావతి: మూడు రాజధానుల అంశంపై ఆదివారం జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రతినిధులతో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ రేపు అత్యవసరంగా సమావేశం కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, మూడు రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. రాజధాని రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చించనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

షిప్‌ యార్డులో ప్రమాదం దిగ్భ్రాంతికరం
విశాఖపట్నంలోని షిప్‌యార్డ్‌ల్ భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందిన ఘటనపై జనసేన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. షిప్‌ యార్డు సంస్థ మృతుని కుటుంబానికి చెందిన ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని కోరింది. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ విజ్జప్తి చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని