పాక్‌ కాల్పుల్లో అమరుడైన సైనికాధికారి - JCO Martyred in paks firing over LoC
close
Updated : 30/08/2020 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ కాల్పుల్లో అమరుడైన సైనికాధికారి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి వీరమరణం పొందారు. నియంత్రణా రేఖ వెంట పాక్‌ దళాల అనుమానాస్పద కదలికల్ని గుర్తించిన భారత సైన్యం తొలుత వారిని హెచ్చరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పాక్‌ దాడిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని