మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం: మనో - Jabardasth 12th November 2020Latest Promo ETV Telugu
close
Published : 08/11/2020 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం: మనో

హైదరాబాద్‌: ‘మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం’ అని అంటున్నారు గాయకుడు మనో. ఆయన, రోజా న్యాయనిర్ణేతలుగా.. అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. షోలో భాగంగా అనసూయ, రోజా, మనోలపై కంటెస్టెంట్స్‌ తరచూ పొగడ్తల వర్షం కురిపిస్తుంటారనే విషయం తెలిసిందే. ఇదే విధంగా తాజాగా విడుదలైన ‘జబర్దస్త్‌’ సరికొత్త ప్రోమో ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది.

హైపర్‌ ఆది తన గ్యాంగ్‌తో కలిసి క్రికెట్‌ లీగ్‌ ఆడారు. చాలాకాలం తర్వాత షేకింగ్‌ శేషు.. ఆది స్కిట్‌తో ‘జబర్దస్త్‌’ స్టేజ్‌పై కనిపించారు. మరోవైపు ‘చలాకీ చంటి’ వరుస పొగడ్తల వల్ల సంతోషంతో కడుపుబ్బా నవ్వుకున్న రోజా, మనో.. ‘మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం’ అని సరదాగా సమాధానమిచ్చారు. అయితే, రాకేశ్‌ మాస్టర్‌ అంటే తాగుబోతు రమేష్‌ ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవాలంటే వచ్చే గురువారం వరకూ వేచి చూడాల్సిందే. నవంబర్‌ 12న ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని