పవన్‌ సరసన బాలీవుడ్‌ భామ!
close
Published : 01/04/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ సరసన బాలీవుడ్‌ భామ!

ఇంటర్నెట్ డెస్క్‌: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, విలక్షణ దర్శకుడు క్రిష్‌ కలయికలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటించబోతున్నట్లు సమాచారం. గతేడాది వచ్చిన సాహో సినిమాలో  ప్రభాస్‌ సరసన  ఒక ప్రత్యేకగీతంలో నటించింది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా కథానాయికగా ప్రేక్షకులను అలరించనుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా దేశంలోని ప్రధాన భాషలన్నింటిలోనూ విడుదల అవనుంది. ఇదివరకే ఆమె  హైదరాబాద్‌కి పలుమార్లు వచ్చి కథా చర్చల్లో పాల్గొన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.  కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసిన వెంటనే జాక్వెలిన్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉందంట. ఈ సినిమాకి  మొత్తం 40 రోజులు కేటాయించిందని సమాచారం. ఈ సినిమాలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఈ బాలీవుడ్‌ భామ కనిపించనుంది. 1870ల కాలం నాటి పరిస్థితులకు తగ్గట్టుగా హైదరాబాద్‌లో భారీ సెట్స్‌ వేసి  సినిమా చిత్రీకరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.ప్రస్తుతం జాక్వెలిన్‌ బాలీవుడ్‌లో జాన్‌అబ్రహం, సల్మాన్‌ సినిమాల్లో కథానాయికగా నటించనుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని