9 నెలల తర్వాత తెరుచుకున్న పూరి ఆలయం - Jagannath Temple In Puri Reopens Today After 9 Months
close
Updated : 23/12/2020 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

9 నెలల తర్వాత తెరుచుకున్న పూరి ఆలయం

భువనేశ్వర్‌: ఒడిశాలోని ప్రముఖ పూరి జగన్నాథుని ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా కారణంగా మార్చి నుంచి ఆలయంలోనికి భక్తులను అనుమతించడం లేదు. ఆలయంలోకి భక్తులను అనుమతించనున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు పరుస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొదట స్థానిక భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1,2 తేదీల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజుల్లో ఆలయాన్ని మూసి ఉంచుతామని వారు తెలిపారు. కేవలం సేవకులను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఎక్కువ సంఖ్యలో ఆలయ సేవకులు కరోనా బారిన పడుతున్నారు. కానీ భక్తుల, వివిధ పార్టీలు ఒత్తిడి తేవడంతో డిసెంబరు మూడో వారం నుంచి ఆలయాన్ని తెరుస్తామని ఒడిశా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ తన ట్విటర్‌ ఖాతాలో పూరీ జగన్నాథుని సైకత శిల్పాన్ని పోస్టు చేసి భక్తులంతా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి..

తిరుపతిలో శ్రీవారి భక్తుల నిరసన

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని