‘ఏలూరు అస్వస్థతపై ఎందుకంత ఉదాసీనత?’ - Janasena Chief Pawan Kalyan On Eluru Incident
close
Published : 10/12/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏలూరు అస్వస్థతపై ఎందుకంత ఉదాసీనత?’

500 పడకల ఆస్పత్రిలో న్యూరో ఫిజీషియన్‌ లేకపోవడమా?
ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి: పవన్‌

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. జనసేన తరఫున ముగ్గురు సభ్యులు ఏలూరులో పర్యటించి నివేదిక ఇచ్చారని చెప్పారు. కనీస వసతుల కల్పనలోనూ ప్రభుత్వానికి ఉదాసీనత ఎందుకని ప్రశ్నించారు. ఆ రోగులకు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు అందించడం సరికాదన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని 500 పడకల ఆస్పత్రిలో న్యూరో ఫిజీషియన్‌ లేకపోవడం వంటి విషయాలు ఆవేదన కలిగిస్తున్నాయనన్నారు. బాధితులు మూర్ఛ వ్యాధికి గురైతే చికిత్స అందించాల్సిన న్యూరో ఫిజీషియన్‌ను విజయవాడ నుంచైనా ఎందుకు రప్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు పవన్‌ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఈ వ్యాధికి కలుషిత నీరు ఓ కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు ఎందుకు సరఫరా చేయడం లేదని పవన్‌ ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం ఒక్క న్యూరో ఫిజీషియన్‌ కూడా లేరని.. ఎంబీబీఎస్‌ వైద్యులే వారి విజ్ఞానం మేరకు వైద్యమందిస్తున్నారని చెప్పారు. రోగులకు నిపుణుల సేవలు అందడం లేదని.. విజయవాడ నుంచి నలుగురు న్యూరాలజిస్టులను ప్రభుత్వం తరలించకపోవడం సిగ్గుచేటని ఆయన ఆక్షేపించారు. ఇది కచ్చితంగా తీవ్ర నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ఏలూరులో పర్యటించిన తర్వాత కూడా అక్కడ అదనపు సదుపాయాలు ఏర్పాటు కాలేదని.. సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్‌ కోరారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని