‘నివర్‌’ బాధిత రైతులను ఆదుకోవాలి:పవన్‌ - Janasena Chief Pawan Kalyan Request to AP Govt
close
Published : 28/11/2020 00:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నివర్‌’ బాధిత రైతులను ఆదుకోవాలి:పవన్‌

అమరావతి‌: నివర్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. క్షే్త్రస్థాయి సమాచారం ప్రకారం సుమారు రూ.వెయ్యి కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను అన్నివిధాలా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోయారన్నారు. అప్పులపాలవుతున్న రైతులను మరింత కుంగదీసేలా ఈ నష్టాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

పెట్టుబడి రాయితీతోపాటు పంటల బీమాను సకాలంలో అందించడం చాలా అవసరమని పవన్‌ అభిప్రాయపడ్డారు. గతేడాది ఖరీఫ్, రబీ పంటల నష్టానికి సంబంధించిన బీమా మొత్తాలు ఇప్పటికీ దెబ్బతిన్న రైతులకు అందలేదని.. ఈ విషయంలో వ్యవసాయశాఖ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల ఈ ఏడాది పంటలు కోల్పోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందజేస్తే వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుందన్నారు. నివర్ తుపానుతో నిరాశ్రయులుగా మిగిలిన వారిని తక్షణమే ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని పవన్‌ కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని