గ్రూప్‌-1 నిర్వహణపై పునరాలోచించాలి: పవన్‌ - Janasena chief Pawan Kalyan On Goup1 Mains exam
close
Published : 11/12/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రూప్‌-1 నిర్వహణపై పునరాలోచించాలి: పవన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఉద్యోగాల క్యాలెండర్‌ ఏమైపోయిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రణాళిక లేని తీరు వల్లే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని మండిపడ్డారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహణపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ వస్తే చెప్పిన తేదీల్లో ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారనే నమ్మకాన్ని యువత కోల్పోతోందన్నారు. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్‌ ఇస్తామని చెప్పిన ఏపీపీఎస్సీ.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని ఆక్షేపించారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చి రెండేళ్లు అయిందన్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షా పత్రంలో 51 తప్పులు వచ్చాయని.. ఈ మేరకు నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పవన్‌ అన్నారు. ఈనెలలో మెయిన్స్‌ నిర్వహణకు కమిషన్‌ సన్నద్ధం అయ్యిందని.. అదే సమయంలో ఇతర ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్య అర్హత పరీక్షలు ఉన్నందున గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహణ తేదీలు మార్చాలని అభ్యర్థులు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారని పవన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉన్నతాధికారులు నిరుద్యోగ యువత సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని