నన్ను నాకు పరిచయం చేసిన చిత్రం ఇదే: జాన్వీ - Janhvi Kapoor about Gunjan Saxena movie
close
Updated : 28/12/2020 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నన్ను నాకు పరిచయం చేసిన చిత్రం ఇదే: జాన్వీ

ముంబయి: భారత వైమానిక దళ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ అందాల నటి జాన్వీకపూర్‌ నటించిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ చిత్రం గురించి జాన్వీ కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘‘కథానాయికగా ఈ చిత్రం నన్ను నేను మరింత అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నాపై ఇది గుంజన్‌ మేడమ్ కథ ప్రభావం అనుకుంటా. ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లేందుకు ఎన్నో విషయాలను ఈ చిత్రం ద్వారా నేర్చుకున్నా. అలాగే ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలని నా కోరిక. అవి వ్యక్తుల జీవితాలను కదిలించే విధంగా ఉండాలి. ఎందుకంటే సినిమాలు నన్ను ఎంతలా కదిలించాయో నాకు తెలుసు’’ అని ఆమె చెప్పారు.

ఈ చిత్రానికి శరణ్‌ శర్మ దర్శకత్వం వహించారు. పంకజ్‌ త్రిపాఠి, అంగద్ బేడీ, మానావ్ విజ్, వినీత్ కుమార్‌ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని