
తాజా వార్తలు
నయనతార చిత్రంలో జాన్వీ కపూర్?
ముంబయి: ‘ధడక్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మంచి మార్కులే కొట్టేసింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆమె నటించిన ‘రూహీ ఆఫ్జా’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘దోస్తానా 2’ చిత్రీకరణ దశలో ఉంది. జాన్వీ ఇప్పుడు మరో చిత్రానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం.
నయతార ప్రధాన పాత్రలో తెరకెక్కి విజయం సాధించిన తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’ హిందీ రీమేక్‌లో జాన్వీ నటించనుంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించనున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. జనవరి 9 నుంచి పంజాబ్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుందని సమాచారం.
Tags :
జిల్లా వార్తలు