మూడుసార్లు మెప్పించారు మరి నాలుగోసారో..! - Japan Pair Dance To NTR Songs
close
Published : 14/12/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడుసార్లు మెప్పించారు మరి నాలుగోసారో..!

ఎన్టీఆర్‌ పాట.. జపాన్‌ జంట ఆట

ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్న వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: నటనలో ఠీవి.. ఆకట్టుకునే వాక్చాతుర్యం.. మెప్పించే డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఇలా ఎన్నో విషయాల్లో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. డైలాగ్‌కు తగ్గట్టు ఆయన పలికించే హావభావాలే కాకుండా బీట్‌కు అనుగుణంగా ఆయన వేసే స్టెప్పులు చూసి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌కు ఫిదా అయిన ఓ జపాన్‌ జంట హీరోమునిరు, అశాహి ససాకీ ఆయన సినిమాలోని పాటలకు మెప్పించేలా స్టెప్పులు వేసి గత కొన్నిరోజులుగా నెటిజన్లను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ‘అశోక్‌’ సినిమాలోని ‘గోల.. గోల..’, ‘సింహాద్రి’లోని ‘చీమ.. చీమ..’, ‘కంత్రి’లోని ‘వయస్సునామీ’ పాటలకు స్టెప్పులేసి ముచ్చటగా మూడుసార్లు మెప్పించిన హీరోమునిరు జంట.. తాజాగా మరోసారి ఆకట్టుకున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలోని ‘ఓ పిల్లా’ పాటకు ఎన్టీఆర్‌-రకుల్‌ మాదిరిగా స్టెప్పులేసి.. ఆ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. హీరోమునిరు షేర్‌ చేసిన వీడియో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. డ్యాన్స్ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ అంటే తమకి ఎంతో ఇష్టమని.. సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకునేందుకే ఆయన పాటలకు డ్యాన్స్‌ చేసి మెప్పిస్తున్నట్లు ఓ సందర్భంగా హీరోమునిరు తెలిపిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి

ఫొటోగ్రాఫర్‌ను ఆటపట్టించిన ఎన్టీఆర్‌

మరోసారి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్‌..?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని