close
Array ( ) 1

తాజా వార్తలు

జావేద్‌ అక్తర్‌ కంగనను బెదిరించాడు

ట్విటర్‌ వేదికగా రంగోలీ ట్వీట్‌

ముంబయి: ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఒకానొక సమయంలో కంగనా రనౌత్‌ను బెదిరించాడంటూ ఆమె సోదరి రంగోలీ ట్విటర్‌ వేదికగా ఆరోపించింది. విషయమేదైనా తనదైన శైలిలో సమాధానం చెప్పే రంగోలీ గత కొన్నిరోజులుగా ట్విటర్‌ వేదికగా ఫిలింఫేర్‌ అవార్డులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆలియా భట్‌కు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ ఇవ్వడం సరికాదంటూ.. ‘గల్లీబాయ్‌’ చిత్రంలో ఆలియా నటన మధ్యస్థంగా ఉందంటూ రంగోలీ పేర్కొన్న విషయం తెలిసిందే.

నరేంద్రమోదీ నియంత అంటూ ఓ ఇంటర్వ్యూలో జావేద్‌ అక్తర్‌, మహేశ్ భట్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ పెట్టారు. ‘మోదీ సర్‌ మిమ్మల్ని ప్రతిరోజూ ఎవరో ఒకరు నియంత అని అంటున్నారు. కాబట్టి అలాంటి వారందరికీ నిజమైన నియంత ఎలా ఉంటారో ఒక్కసారి చూపించండి’ అని సదరు నెటిజన్‌ పేర్కొంది. ఇదిలా ఉండగా నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌పై రంగోలీ స్పందించింది.. ‘ఒకసారి జావేద్‌ అక్తర్‌ కంగనను తన ఇంటికి పిలిపించుకున్నారు. హృతిక్‌కి సారీ చెప్పకపోతే ఊరుకోను అని బెదిరించాడు. అలాగే ఒకానొక సమయంలో సూసైడ్‌ బాంబర్‌గా నటించనన్నందుకు కంగనపై మహేశ్‌ భట్‌ చెప్పులు విసిరాడు. ఇప్పుడు వాళ్లు ప్రధానమంత్రిని నియంత అని అంటున్నారు. మీ ఇద్దరికి ఏమైంది?’ అని రంగోలీ ట్వీట్‌ చేసింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.