జయా బచ్చన్‌ రాజకీయం చేస్తున్నారు: జయప్రద - Jaya Bachchan is doing politics over Ravi Kishans drug claim says Jaya Prada
close
Published : 17/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జయా బచ్చన్‌ రాజకీయం చేస్తున్నారు: జయప్రద

రవి కిషన్‌ మాటల్లో తప్పేం లేదు

ముంబయి: భాజపా ఎంపీ రవికిషన్‌ వ్యాఖ్యల్ని అడ్డుపెట్టుకుని ఎంపీ జయా బచ్చన్‌ రాజకీయాలు చేస్తున్నారని ప్రముఖ నటి, భాజపా నాయకురాలు జయప్రద అన్నారు. కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ కోణం మంగళవారం పార్లమెంటులో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని వారు కూడా మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రవికిషన్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను జయా బచ్చన్‌ ఖండించారు. కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చవద్దని.. నటుడైన ఓ ఎంపీ పరిశ్రమకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ నేపథ్యంలో పలువురు నటీమణులు జయా బచ్చన్‌కు మద్దుతు తెలిపారు. కంగనా రనౌత్‌తో సహా పలువురు నెటిజన్లు ఆమెను వ్యతిరేకించారు.

ఈ ఘటనపై జయప్రద తాజాగా స్పందించారు. ‘డ్రగ్స్‌కు బానిసలైన యువతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రవి కిషన్‌కు నేను పూర్తి మద్దతు తెలుపుతున్నా. మనమంతా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి. మన యువతను కాపాడాలి. ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని జయా బచ్చన్‌ రాజకీయాలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని