జయప్రకాశ్‌రెడ్డి మృతి: ఎవర్‌గ్రీన్‌ పాత్రలివే! - Jaya Prakash Reddy Top-10 Movies
close
Updated : 08/09/2020 22:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జయప్రకాశ్‌రెడ్డి మృతి: ఎవర్‌గ్రీన్‌ పాత్రలివే!

ఇంటర్నెట్‌డెస్క్: అన్ని రకాల పాత్రలు పోషించాలని, నవరసాలు పండించాలని ప్రతి నటుడికీ ఉంటుంది. అయితే, కొందరు కొన్ని మాత్రమే అద్భుతంగా చేయగలరు. అలాంటి అతి కొద్దిమంది నటుల్లో జయప్రకాశ్‌రెడ్డి ఒకరు. చిన్న చిన్న పాత్రలతో సినీ జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. అందులో కథానాయిక తండ్రి వీరభద్రయ్యగా ప్రేమను వ్యతిరేకించే వ్యక్తిగా క్రూరత్వం నిండిన పాత్రలో అదరగొట్టేశారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. అయితే, జయప్రకాశ్‌రెడ్డి కేవలం ప్రతినాయకుడి పాత్రలకే పరిమితం కాలేదు. ఆయనలో అద్భుతమైన హాస్యనటుడు కూడా ఉన్నాడని ఎన్నో చిత్రాల్లో నిరూపించారు. నవరసాల్లో హాస్యరసాన్ని పండించటం చాలా కష్టం. అలాంటిది ఆయన తెరపై కనపడితే నవ్వుల పువ్వులు పూసిన చిత్రాలెన్నో. జయప్రకాశ్‌రెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. ఈ సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాల్లో టాప్‌ పాత్రలు మరోసారి గుర్తు చేసుకుందాం.

‘ప్రేమించుకుందాం రా’లో వీరభద్రయ్య

‘శివుడు.. మీ నాయన నాకు ఎదురొచ్చి నాడు.. చంపేసినా.. రైటా.. రాంగా...’ ‘ప్రేమించుకుందాం రా’  చిత్రంలో ఈ ఒక్క డైలాగ్‌తో జయప్రకాశ్‌రెడ్డి అనే నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతినాయకుడిగా తనదైన ముద్రవేశారు. ఇందులో ఆయన కథానాయిక తండ్రిగా వీరభద్రయ్య పాత్రలో మెప్పించారు.

‘సమర సింహారెడ్డి’లో వీర రాఘవరెడ్డిగా..

‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’లో కానిస్టేబుల్‌ రేలంగి వెంకట్రావు

‘చెన్న కేశవరెడ్డి’లో వెంకటరెడ్డి

‘కబడ్డీ కబడ్డీ’లో పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌

జేపీగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో కామెడీ అదుర్స్‌

ఒక్కమాట కూడా మాట్లాడకుండా ‘ఢీ’లో... ‘చిట్టినాయుడు’గా ‘రెఢీ’ నవ్వులే నవ్వులు

‘నాయక్‌’లో బాబ్జి పెదనాన్నగా..

‘టెంపర్‌’లో హోం మినిస్టర్‌గా..

‘సరిలేరు నీకెవ్వరు’లో కూజాలు చెంబులైతాయ్‌.. అంటూ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని