ఓటీటీలో మరో సూపర్‌హిట్‌ చిత్రం - Jayam Ravi Arvind Swami Bogan Telugu Official Trailer
close
Published : 01/10/2020 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో మరో సూపర్‌హిట్‌ చిత్రం

హైదరాబాద్‌: జయం రవి, అరవింద స్వామి ఈ కాంబినేషన్‌ వినగానే మనకు గుర్తొచ్చే తమిళ చిత్రం ‘తని ఒరువన్‌’. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తమిళ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బోగన్‌’. హన్సిక కథానాయిక. లక్ష్మణ్ దర్శకత్వం వహించారు.

2017 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీ వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ట్రైలర్‌లో జయం రవి పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. మరి అరవిందస్వామి పాత్ర ఏంటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! సాయి రిషిక సమర్పణలో రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్‌ స్వరాలు సమకూర్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని