close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/06/2020 10:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రజనీతో నటించకపోవడానికి కారణమదే..!

జయరామ్‌..!

హైదరాబాద్‌: సినిమాలో ఓ సన్నివేశం నచ్చకపోవడం కారణంగా తాను ‘ముత్తు’ చిత్రం నుంచి తప్పుకున్నానని మలయాళీ నటుడు జయరామ్‌ తెలిపారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ముత్తు’. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరత్‌ బాబు, రాధారవి, మీనా కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో 1995లో విడుదలై రజనీ కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలిచింది. మలయాళీ చిత్రం ‘తెన్‌మావిన్‌ కొంబథ్‌’ ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో శరత్‌బాబు పోషించిన పాత్ర కోసం మొదట చిత్రబృందం జయరామ్‌ని సంప్రదించింది. రజనీకాంత్‌తో కలిసి నటించాలని ఆయన కూడా భావించారు. కాకపోతే సినిమాలోని ఓ సన్నివేశంలో రజనీకాంత్‌ని చెంపదెబ్బ కొట్టాల్సి ఉందని, ఒకవేళ అదే కనుక చేస్తే ఆయన అభిమానులు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని వదులుకున్నానని ఆయన వెల్లడించారు.

మలయాళంలో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు నటుడు జయరామ్‌. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ జయరామ్‌కు ఇటీవల తెలుగులో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ ఏడాది విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆయన నటన ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ప్రస్తుతం ప్రభాస్‌, ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.