‘రాధేశ్యామ్‌’కు సంగీత దర్శకుడు ఎవరంటే? - JustIn Prabhakaran to score music for Radhe Shyam
close
Published : 21/10/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’కు సంగీత దర్శకుడు ఎవరంటే?

హైదరాబాద్‌: కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారయ్యారు. ‘డియర్‌ కామ్రేడ్‌’కు బాణీలు అందించిన జస్టిన్‌ ప్రభాకరన్‌ దీనికి స్వరాలు సమకూర్చనున్నారు. తెలుగు, త‌మిళం, క‌న్నడ, మ‌లయాళం వెర్షన్లకు ఆయనే సంగీత‌ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ప్రభాకరన్‌ గాయకుడిగా, సాహిత్య రచయితగానూ గుర్తింపు పొందారు. తమిళంలో పలు సినిమాల్లో తన స్వరాలు వినిపించారు.

‘రాధేశ్యామ్‌’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించబోతున్న చిత్రంలో నటించనున్నారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని