close

తాజా వార్తలు

Published : 03/12/2020 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కేజీఎఫ్‌-2’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌..!

వెల్లడించిన చిత్ర నిర్మాత

బెంగళూరు: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ నటుడు యశ్‌ కథానాయకుడిగా విడుదలైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం ‘కేజీఎఫ్‌-‌1’కు ఇది స్వీకెల్‌. అయితే, ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్‌డేట్‌ ఇవ్వమని కోరుతూ సోషల్‌మీడియా వేదికగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌కు వరుస సందేశాలు పంపుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా ఓ అభిమాని పెట్టిన ట్వీట్‌కు చిత్ర నిర్మాత కార్తిక్‌ గౌడ స్పందించారు. ‘కేజీఎఫ్‌-2’ టీజర్‌ విడుదల తేదీని వెల్లడించారు.

‘‘కేజీఎఫ్‌’ విడుదలై(డిసెంబర్‌ 21, 2018) మూడేళ్లు అవుతుంది. బాస్‌ సినిమా ‘కేజీఎఫ్‌ 2’ టీజరైనా విడుదల చేయండి’ అంటూ ఓ నెటిజన్‌ నిర్మాత కార్తిక్‌గౌడకు ట్వీట్‌ చేశాడు. సదరు ట్వీట్‌కు స్పందించిన కార్తిక్‌.. ‘యశ్‌ పుట్టిన రోజుకు (జనవరి 8) టీజర్‌ విడుదల చేస్తాం. టీజర్‌ వేరే లెవల్‌లో ఉంటుంది’ అని రిప్లై ఇచ్చారు. కార్తిక్‌.. ట్వీట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరో బర్త్‌డే కోసం అందరూ ఆశ ఎదురుచూస్తున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కేజీఎఫ్‌-2’ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరగుతోంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఈ చిత్రంలో ‘అధీరా’ అనే కీలక పాత్రలో కనిపించారు. అలాగే నటి రవీనాటాండన్‌ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. రావురమేష్‌, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన