మరో సినిమా ప్రకటించిన కేజీఎఫ్‌ డైరెక్టర్‌ - KGF director Prashant Neel announced his next movie
close
Updated : 17/12/2020 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో సినిమా ప్రకటించిన కేజీఎఫ్‌ డైరెక్టర్‌

బెంగళూరు: ‘కేజీఎఫ్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ అనే సినిమాను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హీరో, డైరెక్టర్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే ఆమాత్రం ఉంటుంది కదా..! అయితే.. ఇదిలా ఉండగా.. ఇంకో సినిమా కూడా ప్రకటించి మరో షాక్‌ ఇచ్చాడీ డైరెక్టర్‌. కన్నడ స్టార్ హీరో శ్రీమురళి హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. అంతేకాదు.. సినిమాకు ‘బఘీరా’ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్‌నీల్‌ కథ అందిస్తుండగా.. డాక్టర్‌ సూరి దర్శకత్వం వహించనున్నారు.

హీరో శ్రీమురళి జన్మదినం సందర్భంగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. సలార్‌ను నిర్మించనున్న హంబలే సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మించనుంది. కాగా.. శ్రీమురళి ప్రస్తుతం ‘మద గజరాజ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం పూర్తవగానే ‘బఘీరా’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు.. కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రశాంత్‌నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్‌తో ఓ సినిమా ప్రకటించగా.. తర్వాతి సినిమాను తారక్‌తో చేసే ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఇదీ చదవండి..

బెస్ట్‌ ఆఫ్‌ కేజీఎఫ్‌ చూశారా..?

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని