close
Array ( ) 1

తాజా వార్తలు

సన్నీలియోనీని ఫోన్‌ నంబర్‌ అడగలేదు

కబీర్‌ బేడీ కామెంట్‌పై స్పందించిన నటి భర్త

ముంబయి: సన్నీలియోనీని తాను ఫోన్‌ నంబర్‌ అడిగానంటూ వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు బాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడీ. ఇటీవల డబూ రత్నానీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ముంబయిలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్‌ సెలబ్రెటీలు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా నటుడు కబీర్‌ బేడీ.. సన్నీలియోనీని ఫోన్‌ నంబర్‌ అడిగారంటూ పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కబీర్‌ బేడీ తన గురించి వస్తున్న వార్తలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. తాను సన్నీలియోనీ ఫోన్‌ నంబర్‌ను అడగలేదని తేల్చి చెప్పారు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచూరించిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు. 

‘సన్నీలియోనీని ఫోన్‌ నంబర్‌ అడిగానంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు రాసి వాళ్లు నా పరువుకు భంగం కలిగిస్తున్నారు. డబూ రత్నానీ పార్టీలో డేనియల్‌ వెబర్‌తో మాట్లాడి, ఆయన ఫోన్‌ నంబర్‌ అడిగాను. దానికి వెబర్‌ నా ఫోన్‌ తీసుకుని తన నంబర్‌ డయల్‌ చేసి ఇచ్చారు. నా గురించి ఇలాంటి వార్తలు ఇచ్చినవారు వెంటనే వాటిని తొలగించి, నాకు తక్షణమే క్షమాపణలు చెప్పాలి’ అని కబీర్‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా కబీర్‌ బేడీ గురించి వచ్చిన ఆరోపణలపై సన్నీలియోనీ భర్త డేనియర్‌ వెబర్‌ సైతం స్పందించారు. సదరు వెబ్‌సైట్‌ వారు రాసిన వార్తలను ఖండిస్తూ డేనియల్‌ సైతం ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘కబీర్‌ బేడీ దగ్గర నా భార్య ఫోన్‌ నంబర్‌ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే వారిద్దరూ ఎంతోకాలం నుంచి మంచి స్నేహితులు. మీకు వ్యూస్‌ రావడం కోసం ఇలాంటి వార్తలు రాస్తారా.!!’ అని డేనియల్‌ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.