సందడిగా కాజల్‌ బ్యాచిలరేట్‌ పార్టీ..! - Kajal Bachelorette Party Photos Viral In Social Media
close
Published : 07/10/2020 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సందడిగా కాజల్‌ బ్యాచిలరేట్‌ పార్టీ..!

నెట్టింట్లో ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును అక్టోబర్‌ 30న వివాహం చేసుకోబోతున్నట్లు మంగళవారం ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాజల్ బ్యాచిలరేట్‌ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్‌ నెలాఖరున కాజల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆమె కుటుంబసభ్యులు, గౌతమ్‌ కిచ్లు సోదరితోపాటు అతి తక్కువమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి.. ‘బ్రైడ్‌ టు బి’ క్యాప్షన్‌తో  నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ ఫొటోలను కాజల్‌ సెప్టెంబర్‌ 28న ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నప్పటికీ.. అవి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ పిక్స్‌ అని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. త్వరలో తాను గౌతమ్‌తో ఏడడుగులు వేయబోతున్నట్లు కాజల్‌ ప్రకటించడంతో ఆనాటి ఫొటోలు ఒక్కసారిగా నెట్టింట్లో దర్శనమిచ్చాయి. కాజల్‌-గౌతమ్‌లకు శుభాకాంక్షలు చెబుతూ బ్యాచిలరేట్‌ పార్టీ ఫొటోలను.. ఆమె అభిమానులు పలు సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వేదికగా షేర్‌ చేస్తున్నారు.

గతేడాది విడుదలైన ‘సీత’, ‘రణరంగం’ చిత్రాల తర్వాత కాజల్‌ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న పలు సినిమాల్లో నటిస్తున్నారు. మంచు విష్ణుతో కలిసి ఆమె నటిస్తోన్న ‘మోసగాళ్లు’ టీజర్‌ ఇటీవల విడుదలయ్యింది. శంకర్‌-కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో రానున్న ‘భారతీయుడు-2’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవితో కలసి ఆడిపాడనున్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని.. ప్రేక్షకులను అలరిస్తానని కాజల్‌ ప్రకటించిన విషయం విధితమే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని