కాజల్‌ నిశ్చితార్థ ఉంగరం ఇదేనా! - Kajal Latest Photo Goes Viral Due to Engagement Ring
close
Updated : 24/10/2020 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాజల్‌ నిశ్చితార్థ ఉంగరం ఇదేనా!

వీడియో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: నటి కాజల్‌ అగర్వాల్‌ త్వరలో శ్రీమతిగా మారనున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఆమె పరిణయమాడనున్నారు. మరో వారం రోజుల్లో(అక్టోబర్‌ 30) వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కాజల్‌, గౌతమ్‌ నివాసాల్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పెళ్లి కుమార్తెగా ఏడడుగులు వేసే సమయంలో తన ప్రియనేస్తం చూపులను ఆకట్టుకునేందుకు కాజల్‌ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తన చేతివేళ్లను చూపిస్తూ ఇన్‌స్టా వేదికగా ఆమె స్పెషల్‌ వీడియో పోస్ట్‌ చేశారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న డైమండ్‌ రింగ్‌ అందరిని ఆకర్షించింది. నిశ్చితార్థ ఉంగరమే అయి ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అందంగా ఉందంటూ నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు.

కాగా, వరుడు గౌతమ్‌ కిచ్లు సైతం దుస్తుల ఎంపిక గురించి తెలియజేస్తూ సోషల్‌మీడియా వేదికగా తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘వెడ్డింగ్‌ షాపింగ్‌!! నా వివాహ దుస్తులను ఏ డిజైనర్స్‌ సిద్ధం చేస్తున్నారనుకుంటున్నారు?’ అని ఆయన నెటిజన్లను అడిగారు. మరోవైపు వివాహానంతరం తాము నివసించబోయే ఇంటిని అలంకరించే పనిలో గౌతమ్‌ బిజీగా ఉన్నారని, ఏమైనా సలహాలు ఉంటే చెప్పమని ఇటీవల కాజల్‌ తన అభిమానులను కోరిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని