జూన్‌లో నిశ్చితార్థం: ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌ - Kajal Shares Her Lock down Engagements Pictures
close
Updated : 02/11/2020 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూన్‌లో నిశ్చితార్థం: ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌

లాక్‌డౌన్‌ సమయంలో..

ముంబయి: అగ్ర కథానాయిక కాజల్‌ తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. కాగా జూన్‌లో తమ నిశ్చితార్థం జరిగిందని కాజల్‌ తాజాగా వెల్లడించారు. 

కాగా కాజల్‌ తన నిశ్చితార్థం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని సోమవారం షేర్‌ చేశారు. జూన్‌ నెలలో తన కోసం అందమైన చీర డిజైన్‌ చేసిన మనీష్‌ మల్హోత్రాకు, ఆయన బృందానికి థాంక్స్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ఏదీ సాధ్యం కాని తరుణంలో.. తన నిశ్చితార్థం చీర కోసం మనీష్‌ బృందం కష్టపడ్డ తీరును మెచ్చుకున్నారు. వారు కూడా తన వేడుకలో భాగమయ్యారంటూ తన ప్రేమను సందేశం రూపంలో పంపారు. దీనికి మనీష్‌ స్పందిస్తూ.. లవ్‌ సింబల్స్‌ షేర్‌ చేశారు.

మరోపక్క తన సతీమణి కాజల్‌ Mrs కిచ్లుగా నిద్రలేచిందంటూ గౌతమ్‌ ఫొటో షేర్‌ చేశారు. కాజల్‌ సరదా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చిన ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంది.

తన సోదరి కాజల్‌కు నిషా అగర్వాల్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పెళ్లి ఫొటో షేర్‌ చేస్తూ.. ‘నువ్వు నీ జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టావు. అది అద్భుతం, క్రేజీగా, మరపురాని జ్ఞాపకంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ వైవాహిక జీవితం ప్రేమతో నిండిపోవాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘ధన్యవాదాలు మై బేబీ.. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా. త్వరలోనే నిన్ను కలవాలని ఆతృతగా ఉంది’ అని కాజల్‌ తన చెల్లిని ఉద్దేశిస్తూ అన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని