పెళ్లి మండపానికి పయనమైన కాజల్‌ - Kajal Starts To The Taj mahal Palace
close
Updated : 30/10/2020 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి మండపానికి పయనమైన కాజల్‌

హైదరాబాద్‌: మరికొన్ని గంటల్లో కాజల్‌ అగర్వాల్‌ తన బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి గుడ్‌బై చెప్పనున్నారు. వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజుల నుంచి కాజల్‌, గౌతమ్‌ నివాసాల్లో పెళ్లితంతుకు సంబంధించిన కార్యక్రమాలు వేడుకగా ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం మెహందీ, గురువారం హల్దీ వేడుకలు కాజల్‌ నివాసంలో ఘనంగా జరిగాయి.

కాగా, తాజాగా ఆమె తన తల్లి సుమన్‌ అగర్వాల్‌తో కలిసి వివాహం జరగనున్న ‘తాజ్‌ ప్యాలెస్‌’ హోటల్‌కు పయనమయ్యారు. ముంబయిలోని తన నివాసం నుంచి తల్లి సుమన్‌తో కలిసి బయటకు వచ్చిన కాజల్‌ విలేకర్లను నవ్వుతూ పలకరించారు. అనంతరం అక్కడే ఉన్న పలువురు అభిమానులకు సైతం నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాజల్‌ అభిమానులు నెట్టింట్లో షేర్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని