కాజల్‌కు కాబోయే భర్త గొప్ప వాడు! - Kajal is one of my closest friends says bellamkonda srinivas
close
Published : 21/10/2020 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాజల్‌కు కాబోయే భర్త గొప్ప వాడు!

పెళ్లికి కచ్చితంగా వెళ్తా: బెల్లంకొండ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయిక కాజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో అక్టోబరు 30న శుభకార్యం జరగబోతోంది. అయితే అతిథుల్లో తను కూడా ఉన్నట్లు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ తెలిపారు. కాజల్‌ తన ఇంట్లోని వ్యక్తితో సమానమని ఆమెతో ఉన్న బంధాన్ని వివరించారు.

‘కాజల్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. ఆమెకు సరైన జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్‌ కిచ్లు గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నా. నేనిప్పుడు షూటింగ్‌లో పాల్గొంటున్నా. విరామం తీసుకుని కాజల్‌ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లిని మిస్‌ చేయలేను’ అని చెప్పారు.

అనంతరం తన తర్వాతి సినిమా ‘అల్లుడు అదుర్స్‌’ గురించి ముచ్చటిస్తూ.. ‘లాక్‌డౌన్‌లో విభిన్నమైన లుక్‌లో సిద్ధం కావడానికి ప్రయత్నించా. గడ్డం, మీసాలు పెంచా. గతంలో నేనెప్పుడూ అలా కనిపించలేదు. లాక్‌డౌన్‌లో క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ ఎక్కువగా ఆడా. మంచి ఆహారం తీసుకున్నా.. ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్‌ వచ్చింది. దాదాపు ఏడు నెలల తర్వాత సెట్‌కు వెళ్లాలంటే కొత్తగా అనిపించింది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత తిరిగి పాఠశాలకు వెళ్లడానికి పిల్లాడు ఎలా ఫీల్‌ అవుతాడో నేనూ అలానే ఫీల్‌ అయ్యా (నవ్వుతూ). కానీ షూటింగ్‌ను మాత్రం చాలా మిస్‌ అయ్యా. ఇప్పుడు సెట్‌లోని వారంతా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించి తిరుగుతుంటే విచిత్రంగా అనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అలవాటైపోతోంది. ఈ సినిమా కోసం ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌తో కలిసి పనిచేయడం గొప్పగా ఉంది. వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు’ అని బెల్లంకొండ శ్రీనివాస్‌ అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని