నిజమే.. కల్యాణి, నేను విడిపోయాం - Kalyani divorce confirmed by her husband
close
Published : 19/09/2020 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిజమే.. కల్యాణి, నేను విడిపోయాం

భర్త సూర్యకిరణ్‌

హైదరాబాద్‌: వంశీ తెరకెక్కించిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు నటి కల్యాణి. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో తెలుగులో ఆమె ఎన్నో సినిమాలకు కథానాయికగా పని చేశారు. ఇదే సమయంలో దర్శకుడు, నటుడు సూర్యకిరణ్‌తో ప్రేమలో పడిన ఆమె 2010లో అతన్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కల్యాణి, ఆమె భర్త సూర్య కిరణ్‌ విడిపోయారంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రచారం సాగుతోంది. కానీ ఈ జంట మాత్రం తమ బంధం గురించి అధికారికంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కల్యాణి భర్త సూర్య కిరణ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ వివాహబంధం గురించి కొన్ని విషయాలను వెల్లడించాడు.

‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కల్యాణి, నేను కొన్నేళ్ల క్రితమే విడిపోయాం. ఆమె అంటే నాకిప్పటికీ ఎంతో అభిమానం ఉంది. ఆమె తిరిగి నా జీవితంలోకి వస్తానంటే సంతోషంగా ఆహ్వానిస్తా. కల్యాణి నన్ను ఇష్టపడకపోవడానికి తనకి పర్సనల్‌గా కొన్ని కారణాలున్నాయి.’ అని సూర్య కిరణ్‌ వెల్లడించారు. మలయాళీ భామ కల్యాణి.. రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన ‘శేషు’ చిత్రంతో మొదటిసారి తెలుగు తెరపై కనిపించారు. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’ విజయం తర్వాత ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో అవకాశాలు దక్కించుకున్నారు. కథానాయికగానే కాకుండా వదిన పాత్రల్లో సైతం కల్యాణి ఒదిగిపోయారు. గతేడాది విడుదలైన ‘యాత్ర’ సినిమాలోని ఓ పాత్రలో ఆమె నటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని