త్వరగా కోలుకుని రండి అన్నయ్య: కమల్‌ - Kamal and kushboo prayes about sp bala subrmanaym health
close
Published : 17/08/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరగా కోలుకుని రండి అన్నయ్య: కమల్‌

హైదరాబాద్‌: కరోనాతో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. తాజాగా అగ్ర నటుడు కమల్‌హాసన్‌ ట్విటర్‌ వేదికగా ఎస్పీబీ కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్‌ చేశారు.

‘‘ప్రియమైన అన్నయా.. మీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. నా గొంతుకలా మీరు.. మీ ముఖంగా నేను.. కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నాం. (ఎస్పీబీ గారు కమల్‌ నటించిన పలు చిత్రాలకు ఎస్పీబీ డబ్బింగ్‌ చెప్పారు) మళ్లీ మీ గొంతుక పాటలతో ప్రకాశించాలి. త్వరగా రండి అన్నయ్యా’’ అంటూ ట్వీట్ చేశారు.

ఎస్పీబీగారు గట్టిమనిషి.. కోలుకుని వస్తారు: ఖుష్బూ

నటి ఖుష్భూ కూడా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరి రోజు వారి జీవితంలో ఎస్పీబీ భాగస్వాములయ్యారు. రోజు ఉదయం ఎలాగైతే దేవుడికి ప్రార్థిస్తామో అలాగే రోజూ ఎస్పీబీ పాటలు వినకుండా ఉండలేం. నేను కూడా ఆయన పాటలు వినకుండా ఉండలేను. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పనిచేసేటప్పుడు ఆయన పాటలు వింటాను. పడుకోబోయే ముందు ఆయన పాటలు వింటాను. ప్రయాణంలో ఉన్నప్పుడు వింటాను. నా వరకూ ఆయనొక దేవుడు. భగవంతుడితో సమానంగా ఆయనను నేను ఆరాధిస్తాను. నాలా ప్రపంచంలోని కోట్లాదిమంది అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ కోలుకుని వస్తారని నమ్ముతున్నారు. రావాలి.. మనందరి కోసం రావాలి. తిరిగి పాటలు పాడాలి. ఆయన మరింత కాలం మన జీవితంలో ఉండాలి. నేను మళ్లీ ఆయనను కలిసి మాట్లాడాలి. హత్తుకోవాలి.. ఎస్పీబీ సర్‌ మీకోసం మేమందరం ఎదురుచూస్తున్నాం. త్వరగా కోలుకుని రండి. మీరు వస్తారు’’ అని ఖుష్బూ అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని