టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న కమలా హ్యారిస్‌ - Kamala Harris Receives COVID19 Vaccine Live On Television
close
Published : 30/12/2020 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న కమలా హ్యారిస్‌

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ మంగళవారం కొవిడ్‌-19 టీకా తీసుకున్నారు. ఆమె వ్యాక్సిన్ తీసుకోవడాన్ని టీవీలో లైవ్‌ ఇవ్వడం విశేషం. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లను సమీపిస్తోంది. 3 లక్షల 35 వేలకు పైగా ప్రజలు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రో-అమెరికన్లలో కొవిడ్‌ కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. అంతేకాకుండా టీకాను తీసుకోవటానికి వారు అంతగా ఆసక్తిచూపటం లేదని సర్వే ఫలితాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో.. వాషింగ్టన్‌లోని ఆఫ్రికన్‌ అమెరికన్ల జనాభా అధికంగా ఉండే ప్రాంతంలోని యునైటెడ్‌ మెడికల్‌ సెంటర్‌లో టీకా వేయించుకోవాలన్న కమలా హ్యారిస్‌ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

‘‘కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తుచేయాలనుకుంటున్నాను. ఈ టీకాను మీరున్న ప్రాంతంలోనే, మీకు పరిచయం ఉన్న వారి ద్వారానే తీసుకునే అవకాశం ఉందని తెలిపేందుకు సంతోషిస్తున్నాను’’ అని టీకా తీసుకున్న అనంతరం ఆఫ్రికన్‌ అమెరికన్లతో పాటు అమెరికన్‌ ప్రజలను ఉద్దేశించి ఆమె  ప్రసంగించారు. కాగా, నవంబర్‌ 3 నాటి అగ్రరాజ్య ఎన్నికల్లో గెలిచి, జనవరి 20,2021న ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ స్థానానికి చేరుకున్న తొలి మహిళగా, ఇండియన్‌ అమెరికన్‌గా, నల్ల జాతి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.

ఇవీ చదవండి..

అదే ప్రథమ కర్తవ్యం.. హారిస్‌

అమెరికాలోనూ కొత్త కరోనా!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని