చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయ్‌: కంగన - Kangana Ranaut Alleges Getting Rape and Death Threats
close
Published : 20/12/2020 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయ్‌: కంగన

మరోసారి తెరపైకి కంగన, దిల్జిత్‌ వార్‌

ముంబయి: రైతుల ఆందోళన నేపథ్యంలో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో గత 24 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. అన్నదాతల నిరసనకు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంఘీభావం తెలుపుతుండగా.. కంగన మాత్రం సదరు ఆందోళన పట్ల పూర్తి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా పంజాబీ సింగర్‌ దిల్జిత్‌కు, కంగన్‌కి మధ్య ట్విటర్‌లో యద్ధం జరుగుతోంది. ఇటీవల కొంతమేర చల్లబడిన వీరిద్దరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

కాగా, గతకొన్ని రోజులుగా తనకి అత్యాచార, హత్యకు సంబంధించిన బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ తాజాగా కంగన ఓ ప్రత్యేక వీడియోని రూపొందించి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘గత 10-12 రోజుల నుంచి ఆన్‌లైన్‌ వేదిక నేను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అత్యాచారం, హత్య చేస్తామంటూ కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు. ఈ దేశంలో ఉన్న ప్రజలను కొన్ని ప్రశ్నలు అడగాలనే ఈ వీడియో చేస్తున్నాను. అన్నదాతలు చేస్తున్న నిరసన పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనది. ఉగ్రవాదులు కూడా అందులో పాల్గొంటున్నారు. నేను పంజాబ్‌లోనే స్కూల్‌ చదువు పూర్తి చేశాను. అక్కడే పెరిగాను. అక్కడ ఉన్న ప్రజలకు దేశంపట్ల ఎంతో ప్రేమ, గౌరవం ఉంటుంది. ఉగ్రవాదులు, విదేశీ శక్తుల ముందు మనం ఎలా బలహీనంగా ఉన్నాము? నేను దేశభక్తి గల మహిళని. ప్రతిరోజూ ఆ విధంగానే పనిచేస్తాను. ఇన్నాళ్లు నాపై వ్యాఖ్యలు చేసిన ప్రియాంక చోప్రా, దిల్జిత్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకని వాళ్లని ఎవరూ ప్రశ్నించడం లేదు? రాజనీతికి అనుగుణంగా దేశం వైపు నేను గళం విప్పి మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్లు ఎలాంటి నీతిని ఫాలో అవుతున్నారు? దయచేసి వారిని అడగండి’ అని కంగన పేర్కొన్నారు.

మరోవైపు కంగన పెట్టిన వీడియో పట్ల సింగర్‌ దిల్జిత్‌ స్పందించారు. ‘సమాజంలో కొంతమంది అమ్మాయిలు ఉంటారు. పొద్దునే నా పేరును స్మరించకపోతే వారికి తిన్న ఆహారం జీర్ణం కాదు. అలాంటి అమ్మాయిల్లో ఒకరు మాత్రం ఎంతో చిరాకు తెప్పిస్తుంటుంది. అలాంటి వారి గురించి పట్టించుకోకండి. వాళ్లు అలాగే చేస్తుంటారు’ అని అన్నారు.

ఇవీ చదవండి

ఇండస్ట్రీలో చాలామంది నాకు వ్యతిరేకం

నిధి అగర్వాల్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్‌

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని