
తాజా వార్తలు
ఇండస్ట్రీ ఆ కుటుంబాలది కాదు: కంగన
బాలీవుడ్‌పై మరోసారి నటి ఫైర్
ముంబయి: విషయమేదైనా సరే ధైర్యంగా తన మనసులోని భావాలను బయటపెడుతుంటారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. దీంతో కొన్నిసార్లు ఆమె వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులపై విరుచుకుపడిన కంగన తాజాగా మరోసారి బీటౌన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ‘జల్లికట్టు’ చిత్రం 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారతదేశం తరఫున ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జల్లికట్టు’ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్ పెట్టారు. ఈ క్రమంలోని బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు.
‘‘ప్రతిఒక్కరిపై అధికారం చలాయించాలని చూసే బుల్లీడవుడ్ (Bullydawood) గ్యాంగ్‌కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ అనేది కేవలం నాలుగు కుటుంబాలకు మాత్రమే చెందింది కాదు. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కొండి. ఎందుకంటే.. జ్యూరీ తన విధిని నిర్వర్తిస్తుంది. ‘జల్లికట్టు’ చిత్రబృందానికి కంగ్రాట్స్’’ అని కంగన అన్నారు. కంగన బాలీవుడ్‌ను ఇటీవల కాలంలో స్పెల్లింగ్ మార్చి సంబోధిస్తున్న విషయం తెలిసిందే.
‘శకుంతలా దేవీ’, ‘గుంజన్ సక్సేనా’, ‘ఛపాక్’, ‘గులాబో సితాబో’, ‘చెక్‌పోస్ట్’, ‘స్కై ఈజ్ పింక్’.. వంటి 27 చిత్రాలను పరిశీలించిన అనంతరం ‘జల్లికట్టు’ చిత్రాన్ని ఎంపిక చేసి భారత్ తరఫున ఆస్కార్ పురస్కారాలకు పంపిస్తున్నట్లు జ్యూరీ ఛైర్మన్ తెలిపారు. మనుషుల్లో దాగున్న క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మానవుల తీరును సూటిగా ప్రశ్నించే విధంగా ఈ చిత్రం ఉందని ఆయన అన్నారు. జ్యూరీ నిర్ణయంపై దర్శకుడు లిజో, నిర్మాత థామస్ పణికర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోసి, సబుమన్ అబ్దుసమద్, సంత్య బాలచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019లో విడుదలయ్యింది.
ఇదీ చదవండి.. రివ్యూ: జల్లికట్టు
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- సాహో భారత్!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
