భాజపా, కాంగ్రెస్ టికెట్లు ఆఫర్ చేశాయి: కంగన - Kangana about election tickets offerd by parties
close
Published : 15/08/2020 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా, కాంగ్రెస్ టికెట్లు ఆఫర్ చేశాయి: కంగన

ముంబయి: ఎన్నికల సమయంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తనకు టికెట్లు ఇవ్వడానికి ముందుకొచ్చాయని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించారు. తనకు ఇష్టమైన రాజకీయ నేతకు మద్దతు తెలపడం వల్ల తాను రాజకీయాల్లోకి వస్తానని భావించారన్నారు. ఈ సందర్భంగా ఆమె తన రాజకీయ ప్రవేశం గురించి వరస ట్వీట్లలో ప్రస్తావించారు. 

‘‘నేను రాజకీయాల్లోకి రావడానికే ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలుపుతున్నానని కొందరు భావించారు. మా తాతయ్య వరసగా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయపరంగా మా కుటుంబం చాలా పేరున్నది. ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రం తర్వాత దాదాపు ప్రతి ఏడాది నాకు కాంగ్రెస్‌ నుంచి ఆఫర్లు వచ్చేవి. ‘మణికర్ణిక’ తర్వాత కాంగ్రెస్‌ నుంచే కాకుండా అదృష్టవశాత్తూ భాజపా కూడా టికెట్ ఆఫర్ చేసింది. కానీ ఒక కళాకారిణిగా నా పని పట్ల ఎక్కువ మక్కువ పెంచుకున్నాను. రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక స్వతంత్ర ఆలోచనాపరురాలిగా నేను మద్దతు ఇవ్వాలనుకున్న వ్యక్తికి మద్దతు ఇచ్చే క్రమంలో వచ్చే అన్ని ట్రోలింగ్‌లను ఆపాలి’’ అని కంగనా తనను ట్రోల్ చేసేవారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

సినిమాల విషయానికి వస్తే..ఏఎల్‌ విజయ్ దర్శకత్వంలో కంగనా ‘తలైవి’ చిత్రంలో జయలలితగా నటిస్తున్నారు. ఆ సినిమాను జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నించినా.. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని