close

తాజా వార్తలు

Updated : 28/11/2020 07:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘బాలీవుడ్‌ భార్యలు’ వివాదం సమాప్తం!

ముంబయి: ఇటీవల బాలీవుడ్‌లో వేడి పుట్టించిన ‘బాలీవుడ్‌ భార్యలు’ టైటిల్‌ వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. వివాదానికి కారణమైన నిర్మాత కరణ్‌ జోహార్‌ క్షమాపణ చెప్పారు. ఓ వెబ్‌ సిరీస్‌కు ఆయన ‘బాలీవుడ్‌ వైవ్స్‌’(బాలీవుడ్‌ భార్యలు) అనే పేరు ప్రకటించారు. అప్పటి నుంచి బీటౌన్‌లో వివాదం తెరలేచింది. ఆ టైటిల్‌ తనదని నిర్మాత, దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తీస్తున్న సినిమా పేరును వెబ్‌ సిరీస్‌కు పెట్టాలనుకోవడం నైతికంగా సరికాదని, ఈ పేరును మార్చుకోవాలని ఆయన కోరారు. అయితే.. కరణ్‌ జోహార్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాస్త వేడి వాతావరణం నెలకొంది. తాజాగా.. కరణ్‌ జోహార్‌ క్షమాపణలు చెబుతూ భండార్కర్‌కు ట్విటర్‌ ద్వారా ఓ లేఖను పంపించారు. ఆ పేరుతో ఎవర్నీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నారు.
‘‘మనిద్దరం ఈ సినిమా పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఉన్నాం. మా తీరుతో కలత చెందారని తెలిసింది. నేను క్షమాపణలు కోరుతున్నా. మా ప్రాజెక్టుకు ‘ది ఫ్యాబులస్ లైవ్స్’ అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. రాబోయే మా వెబ్‌సిరీస్ పూర్తి భిన్నంగా ఉంటుందని, ఎవరికీ ఇబ్బందికరంగా ఉండదని మీకు భరోసా ఇస్తున్నా” అని కరణ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

కరణ్‌ జోహార్‌ తన కొత్త వెబ్‌ సిరీస్‌ కోసం ‘బాలీవుడ్‌ వైవ్స్‌’ అనే టైటిల్‌ ఇవ్వాలని భండార్కర్‌ను గతంలో కోరారు. అప్పటికే.. ఆ పేరుతో భండార్కర్‌ తీస్తున్న సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే.. టైటిల్‌ హక్కులు లేకుండానే.. కరణ్‌ తన ప్రాజెక్టుకు ‘బాలీవుడ్‌ వైవ్స్‌’ అని పేరు ప్రకటించారు. దీంతో మధుర్ భండార్కర్.. కరణ్‌ జోహార్‌పై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. కరణ్‌ జోహార్‌ ఈ మధ్య తరచూ వివాదాల్లో కేంద్ర బిందువు అవుతున్నారు. సుశాంత్‌ కేసులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన విషయం అందరికీ తెలిసిందే.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని