కార్తి ఇంట్లో సెలబ్రేషన్స్‌ - Karthi blessed with a baby boy
close
Published : 21/10/2020 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్తి ఇంట్లో సెలబ్రేషన్స్‌

శుభవార్త చెప్పిన హీరో

చెన్నై: కోలీవుడ్‌ హీరో కార్తి శుభవార్త చెప్పారు. ఆయన సతీమణి రంజనీ మంగళవారం సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు తన ఆనందాన్ని తెలియజేస్తూ కార్తి తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘తాజాగా మా దంపతులకు బాబు జన్మించాడు. మా జీవితాలకు సంతోషాన్ని అందించడానికి సేవలందించిన వైద్యులు, నర్సులకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మా చిన్నారి బాబుకి మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మా కుటుంబంలో ఆనందాన్నినింపిన దేవుడికి కృతజ్ఞతలు’ అని ఆయన పేర్కొన్నారు. సంతోషకరమైన వార్తని కార్తి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 2011లో వివాహబంధంతో కార్తి-రంజనీ ఒక్కటయ్యారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2013లో ఈ జంటకు ఉమయాల్‌ అనే పాప జన్మించింది.

గతేడాది విడులైన ‘ఖైదీ’ చిత్రం కార్తికి మంచి విజయాన్ని అందించింది. ఇందులో ఆయన నటన చూసి ప్రేక్షకులకు, సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘సుల్తాన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాలు ఉన్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని