మూడేళ్ల నుంచి అదే ఉత్సుకతతో ఉన్నా! - Karthis Sulthan Wrapped Up In Style
close
Published : 08/10/2020 22:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడేళ్ల నుంచి అదే ఉత్సుకతతో ఉన్నా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తి, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్‌’. బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు. కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా కార్తీ చిత్ర బృందంతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

‘‘ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. మూడు సంవత్సరాల క్రితం సినిమా కథను నాకు వినిపించారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై నేను ఉత్సుకతతో ఉన్నాను. నా కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు ఈ సినిమా కోసం తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించారు’’ -ట్విటర్‌లో కార్తి

కణ్ణన్‌ గతంలో ‘రెమో’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘సుల్తాన్‌’ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తుండగా, వివేక్‌ మర్విన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని