‘రెడ్‌’ నుంచి అదిరిపోయే థీమ్‌ సాంగ్ - Kaun Acha Kaun Lucha Lyrical Video Song RED
close
Published : 13/12/2020 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రెడ్‌’ నుంచి అదిరిపోయే థీమ్‌ సాంగ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో మాస్‌ హీరోగా మారి కెరీర్‌లోనే భారీ విజయం నమోదు చేశాడు రామ్‌ పోతినేని. అదే జోరుతో మరోసారి మాస్‌ అవతారమెత్తి అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యాడు. అందుకే తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రెడ్‌’ సినిమాకు ఓకే చెప్పేశాడు. చిత్రీకరణ కూడా ప్రారంభమై.. శరవేగంగా జరుగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. హ్యాట్రిక్‌ విజయం కోసం మరోసారి ఈ జోడీ చేతులు కలిపింది. కాగా.. ఇప్పటికే టీజర్‌తో అభిమానుల్లో ఆసక్తి రేపిన చిత్రబృందం తాజాగా థీమ్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటను మాస్‌ అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

‘వాడూ వీడూ బ్యాడు.. అంటూ నువ్వు చెప్పకు దొబ్బెయ్‌’ అంటూ సాగే ఈ పాటలో మణిశర్మ మరోసారి తన మార్కు సంగీతం చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమాను ప్రేక్షకుల మైండ్‌లోనే నిలిచిపోయేలా చేసే మణిశర్మ ఇస్మార్ట్‌శంకర్‌కు కూడా సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ ముగ్గురు భామలు సందడి చేయనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి..

డబుల్‌ యాక్షన్‌.. డబుల్‌ థ్రిల్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని