కీర్తి సురేశ్‌ వీడియో.. షాకైన అభిమానులు - Keerthy suresh u are becoming very thin fans comment
close
Published : 03/10/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి సురేశ్‌ వీడియో.. షాకైన అభిమానులు

హైదరాబాద్‌: ‘మహానటి’ సావిత్రిగా మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేశ్‌. ఇటీవల ‘పెంగ్విన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఇప్పుడు ‘రంగ్‌ దే’, ‘అన్నాత్తె’లో నటిస్తున్నారు. ‘కాఫీ డే’ సందర్భంగా సినిమా షూటింగ్‌ బ్రేక్‌లో తీసుకున్న ఓ వీడియోను ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాఫీ తనలో కొత్త ఉత్సాహం నింపుతుందని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కచ్చితంగా కప్పు కాఫీ తాగుతానని అన్నారు. అయితే.. వీడియోలో ఆమెను చూసిన ఫాలోవర్స్‌ షాక్‌ అయ్యారు. కీర్తి అందులో చాలా సన్నగా కనిపించడమే దీనికి కారణం. ‘దయచేసి మళ్లీ బరువు పెరుగు కీర్తి, చాలా సన్నబడ్డావు, ఇలా మారిపోయావ్‌ ఏంటి?..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. అయితే కొందరు మాత్రం ఆమె ఇలానే బావున్నారని పోస్ట్‌లు చేశారు. దీంతో కీర్తి వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 10 లక్షల మందికిపైగా దీన్ని వీక్షించారు.

కీర్తి సురేశ్‌ గత కొన్ని నెలలుగా తెగ కసరత్తులు చేస్తున్నారు. గతంతో పోల్చితే చాలా సన్నబడ్డారు. ఈ క్రమంలో తీసిన ఫొటోలు ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. కానీ తాజా వీడియోలో ఆమె మరింత స్లిమ్‌గా కనిపించారు. 150 సూర్య నమస్కారాలతో రోజు ప్రారంభమైతే ఎంతో బాగుంటుందంటూ.. ఇటీవల వ్యాయామం వీడియో షేర్‌ చేశారు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, రక్తప్రసరణ బాగా జరుగుతుందని తెలిపారు. కీర్తి నటించిన ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌ లక్ సఖి’, ‘మరక్కర్‌’ సినిమాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని