గాలిలో పల్టీలు.. ఇది కూడా వికెట్‌ సెలబ్రేషనే!  - Kevin Sinclair of Guyana Amazon Warriors celebrates the dismissal of Mitchell Santner in the Caribbean Premier League
close
Published : 05/09/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాలిలో పల్టీలు.. ఇది కూడా వికెట్‌ సెలబ్రేషనే! 

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విండీస్‌ క్రికెటర్‌ విన్యాసం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో విశేషకరమైన, వింతైన వికెట్‌ సెలబ్రేషన్‌ జరిగింది. గురువారం రాత్రి గుయానా వారియర్స్‌, బార్బడోస్‌ ట్రైడెంట్స్‌ జట్ల మధ్య 26వ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా గుయానా బౌలర్‌ కెవిన్‌ సింక్లెయిర్‌.. బార్బడోస్‌ బ్యాట్స్‌మన్‌ మిచెల్‌ శాంట్నర్‌(18)ను 16వ ఓవర్‌ చివరి బంతికి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆనందం పట్టలేకపోయిన కెవిన్‌ అమాంతం గాల్లోకి ఎగిరి మూడు పల్టీలు కొట్టాడు. అది చూసిన వ్యాఖ్యాతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించిన వీడియోను కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ట్విటర్‌లో పంచుకుంది. అది చూసిన నెటిజన్లు అయోమయానికి గురయ్యారు. క్రికెట్‌లో వికెట్‌ పడితే ఇలా కూడా చేస్తారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా వీక్షించారు. గతంలోనూ ఈ కరీబియన్‌ లీగ్‌లో వింతైన వికెట్‌ సెలబ్రేషన్స్‌ చోటుచేసుకున్నాయి. ఒక విండీస్‌ బౌలర్‌ గతేడాది వికెట్‌ తీసిన సందర్భంలో మైదానంలోనే మ్యాజిక్‌ షోలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 89/9 స్వల్ప స్కోరు మాత్రమే చేసింది. అనంతరం గుయానా ఆడుతూ పాడుతూ 14.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని